: ముఖ్యమంత్రితో మంత్రి పార్ధసారథి, జేసీ భేటీ
విభజన ప్రక్రియ వేగవంతమవుతున్న ఈ తరుణంలో రాజకీయ నేతల భేటీలకు ప్రాధాన్యత పెరిగింది. ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఇవాళ మంత్రి పార్థసారథి, మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి సమావేశమయ్యారు. సమైక్యవాదం వైపున్న వీరు శాసనసభలో బిల్లు తీర్మానంపై ఎలా వ్యవహరించాలన్న దానిపై సమాలోచనలు చేసినట్టు సమాచారం అందింది. ఇప్పటికే టీఆర్ఎస్ సభలో తమ బలాన్ని పెంచుకునేందుకు విభజనకు ఓటేస్తున్న వారితో చర్చలు సాగించింది.