: ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా ఏఏపీ,బీజేపీ పారిపోయాయి: కాంగ్రెస్
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ, ఏఏపీ సుముఖత చూపని సంగతి తెలిసిందే. ధీంతో కాంగ్రెస్ పార్టీ ఈ సమయాన్ని విమర్శలు చేసేందుకు ఉపయోగించుకుంటోంది. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా బీజేపీ, ఏఏపీ పలాయనం బాట పట్టాయని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానించారు. దీనివల్ల ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తీర్చే అవకాశం లేదని కాంగ్రెస్ ఎంపీ సంజయ్ నిరుపమ్ అన్నారు. పార్లమెంటు ఆవరణలో మీడియాతో ఆయన మాట్లాడుతూ..ఎన్నికల తర్వాత ఆరు నెలల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. మరి, వారెందుకు దూరంగా ఉంటున్నారో మాత్రం తెలియడం లేదని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఏఏపీకి బేషరతుగా మద్దతు ఇస్తామని ఇదివరకే చెప్పామని నిరుపమ్ వెల్లడించారు.