: అర్హత లేకున్నా దిగ్విజయ్ ఎర్రబుగ్గ కారు వాడేశాడు


కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ అర్హత లేకున్నా ఎర్రబుగ్గ కారులో దర్జాగా నగర వీధులను చుట్టేశాడు. దిగ్విజయ్ సింగ్ కేంద్ర మంత్రి కాదు, ప్రభుత్వ ఉన్నతోద్యోగి కూడా కాదు.. కనీసం ప్రజాప్రతినిధి కూడా కాదు. అయినా సరే రాష్ట్ర పర్యటన సందర్భంగా మందీ మార్బలం వెంటరాగా ఎంచక్కా ఎయిర్ పోర్ట్ నుంచి లేక్ వ్యూ అతిథి గృహానికి ఎర్రబుగ్గ కారులో విచ్చేశారు. రెండు రోజుల క్రితమే ఎరుపు, నీలం రంగు కార్ల వినియోగానికి సంబంధించి సుప్రీం మార్గదర్శకాలు చేసింది. రాజ్యాంగ బద్దమైన పోస్టులో ఉన్నవారే ఎర్ర బుగ్గ కార్లు వినియోగించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంగా చెప్పిన సంగతి తెలిసిందే. మరి ‘సుప్రీం‘ మాటలు మన డిగ్గీరాజాకు వినపడలేదా..?

  • Loading...

More Telugu News