: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియానే నంబర్ వన్


ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో భారత క్రికెట్ జట్టు తొలి స్థానంలో నిలిచింది. ఈ మేరకు 120 రేటింగ్ తో టీమిండియా అగ్ర స్థానాన్ని దక్కించుకుందని ఐసీసీ ప్రకటించింది. రెండవ స్థానంలో 114 రేటింగ్ తో ఆస్ట్రేలియా జట్టు ఉంది. తర్వాత స్థానాల్లో ఇంగ్లండ్(111), దక్షిణాఫ్రికా(110), పాకిస్థాన్(100) ఉన్నాయి. టాప్ టెన్ ఆటగాళ్లలో.. దక్షిణాఫ్రికా కెప్టెన్ డివిలియర్స్ ఉన్నట్లు ఐసీసీ ప్లేయర్ ర్యాంకింగ్ బోర్డు తెలిపింది. దాంతో, వన్డే మ్యాచ్ లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా డివిలియర్స్ నిలిచాడు. తర్వాత స్థానంలో భారత ఆటగాడు విరాట్ కోహ్లీ ఉన్నాడు. కెప్టెన్ ధోనీ ఆరో ర్యాంకు, శిఖర్ ధావన్ పదవ ర్యాకుంలో ఉన్నారు. రోహిత్ శర్మ 18వ ర్యాంకులో ఉన్నాడు. ఇక టాప్ టెన్ బౌలర్లలో తొలి స్థానంలో.. పాకిస్థాన్ స్పిన్ బౌలర్ సయిద్ అజ్మల్ కొనసాగుతున్నాడని ఐసీసీ తెలిపింది.

  • Loading...

More Telugu News