: రాందేవ్ బాబా పతంజలి యోగ్ పీఠ్ ట్రస్ట్ పై పదకొండు కేసులు
యోగా గురువుగా రాందేవ్ బాబా ఎంత పాప్యులర్ అయ్యారో.. పలు విషయాలపై తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెబుతూ కూడా మరింత పాప్యులర్ అయ్యారు. ఈ క్రమంలో రాందేవ్ కు దేశవిదేశాల్లో మంచి క్రేజ్ వచ్చింది. ఇదిలా ఉంటే రాందేవ్ ఆధ్వర్యంలో నడిచే 'పతంజలి యోగ్ పీఠ్ ట్రస్ట్'పై తాజాగా పదకొండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులన్నీ స్టాంప్ డ్యూటీ ఎగవేత కారణంగానే నమోదు చేసినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది. గతంలోనూ ట్రస్టుపై పలు కేసులు నమోదవగా వాటి సంఖ్య ప్రస్తుత కేసులతో 96కు చేరుకుందని హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ నిధి పాండే తెలిపారు. ప్రధాన కేసులన్నీ భారతీయ స్టాంప్ చట్టం ఉల్లంఘన కిందే నమోదైనట్లు పేర్కొన్నారు.