: మళ్లీ మా వాళ్ల నాటకాలు షురూ : బైరెడ్డి
సమైక్యాంధ్ర ముసుగులో ప్రజల్ని మరోసారి మోసం చేసేందుకు సీమాంధ్ర నేతలు సన్నాహాలు చేస్తున్నారని రాయలసీమ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు అసెంబ్లీకి రాగానే రాయల సీమకు చెందిన కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ సీపీ నేతల నాటకాలు మొదలవుతాయని విమర్శించారు. రాయల తెలంగాణ పేరుతో.. రాయలసీమను ముక్కలు చేయమని చెప్పడానికి కావూరి సాంబశివరావు ఎవరు? అని బైరెడ్డి ప్రశ్నించారు.