: త్వరలో చాక్లెట్లకి కరవు


చాక్లెట్స్ అంటే ఇష్టపడని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు బిళ్లలుగా నీరాజనాలందుకున్న.. చాక్లెట్ వివిధ ఫ్లేవర్లలో రంగురుచులతో పాటు పేర్లు కూడా మార్చుకుని జిహ్వచాపల్యాన్ని తీరుస్తోంది. ఇప్పుడు ఈ చాక్లెట్లకు ముప్పు వచ్చిపడింది. రానున్న రోజుల్లో చాక్లెట్లు మరింత ప్రియం కానున్నాయి. దీనికి కారణం ఆఫ్రికా! చాక్లెట్లకి, ఆఫ్రికాకి సంబంధం ఏంటనేగా మీ అనుమానం... ప్రపంచ వ్యాప్తంగా తయారవుతున్న చాక్లెట్లకు అవసరమైన కోకోబీన్స్ లో 40 శాతం ఆఫ్రికా దేశమైన ఐవరీ కోస్ట్ లో పండుతాయి.

ఇక్కడి అంతర్యుద్ధం కారణంగా వేలాది మంది రైతులు వివిధ దేశాలకు వలస వెళ్లిపోతున్నారు. కోకో చెట్టు పంటకు రావాలంటే నాలుగేళ్లు పడుతుంది. తీరా పంటచేతికి వచ్చినా గిట్టుబాటు ధర రావడం లేదు. అంటే, కోకోబీన్స్ పంట కూడా వరిలా తయారైందన్నమాట!

దీని కారణంగా కోకోబీన్స్ పండించే ఐవరీకోస్టు, ఘనా వంటి దేశాల్లో రబ్బర్ చెట్లు పండించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో చాక్లెట్ల తయారీలో డ్రైఫ్రూట్స్ వాడి తయారు చేస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. 2020 నాటికి కోకోబీన్స్ సాగు పెద్దగా ఉండదని పలు సర్వేలు కూడా సూచిస్తున్న సంగతి గుర్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News