: టీవీ సీరియల్ రాస్తున్న వివాదాస్పద రచయిత్రి


బంగ్లాదేశ్ కు చెందిన వివాదాస్పద రచయిత్రి తస్లిమా నస్రీన్ తన భావాలను మరింత విశాలంగా పంచుకోవాలనుకుంటున్నారు. అందుకే ఈసారి టీవీ సీరియల్ ల వైపు దృష్టి సారించారు. గతంలో పలు పుస్తకాల ద్వారా స్త్రీల అణచివేతపై గళమెత్తిన తస్లిమా, ఈసారి స్త్రీల అణచివేత ప్రధానాంశంగా ఓ టీవీ సీరియల్ రాస్తున్నారు. గత ఏడాది ఛాందసవాదుల నిరసనల కారణంగా కోల్ కతా పుస్తక ప్రదర్శనలో జరగాల్సిన పుస్తకావిష్కరణ కార్యక్రమం రద్దయ్యాక, ఆమె వార్తల్లో కనిపించడం ఇదే ప్రథమం.

  • Loading...

More Telugu News