: రాహుల్ గాంధీకి తప్పిన విమాన ప్రమాదం
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. రన్ వే పై మరో విమానం ఉండగానే రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించింది. అయితే చివరి క్షణాల్లో విమానాన్ని గుర్తించిన పైలట్... చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేయకుండా మళ్లీ పైకిపోనిచ్చాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. రాహుల్ రాయ్ బరేలీ నుంచి ఢిల్లీ వస్తుండగా ఈ ఘటన జరిగింది. దీనిపై పౌర విమానయాన శాఖ దర్యాప్తుకు ఆదేశించింది.