: భారత ప్రధానిని కలిసిన పాక్ ప్రధాని సోదరుడు
భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు, ఆ దేశంలోని పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్ ఈ రోజు ఢిల్లీలో కలిశారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీ వచ్చిన వెంటనే ఆయన ప్రధానిని కలిసి మంతనాలు జరిపారు. రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు కోరుకుంటున్న తన సోదరుని (నవాజ్ షరీఫ్) సందేశాన్ని భారత ప్రధానికి షాబాజ్ అందజేశారు.