: ప్రధాని కావాలని సోనియా ఎప్పుడూ అనుకోలేదు: ఆస్కార్ ఫెర్నాండెజ్


మరో మూడు నెలల అనంతరం లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనే అంశంపై కాంగ్రెస్ లో చర్చలు మొదలయ్యాయి. మొదటి నుంచి రాహుల్ గాంధీనే ప్రధాని అభ్యర్థి అని అందరూ అనుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో హస్తానికి తీవ్ర పరాభవం ఎదురవడంతో, ఇప్పుడు రాహుల్ పేరును ఎవరూ ఎత్తడంలేదు. దాంతో, ఎవరిని పార్టీ ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేయాలనే దానిపై కాంగ్రెస్ కు తల తిరిగిపోతోంది.

ఈ క్రమంలో ఆ పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతున్నారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నేత ఆస్కార్ ఫెర్నాండెజ్ మాట్లాడుతూ.. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ప్రధానమంత్రి కావాలని ఎప్పుడూ అనుకోలేదని తెలిపారు. పార్టీ తీవ్ర సమస్యల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి ఆమె ప్రవేశించారన్న ఫెర్నాండెజ్... ప్రధాని పదవిని తీసుకోవాలని గతంలో పార్టీ విజ్ఞప్తి చేసినా ఆమె తిరస్కరించారని గుర్తు చేశారు. ఒకవేళ సోనియా ప్రధాని కాదల్చుకుంటే రాజీవ్ మరణించినప్పుడే తేలికగా ఆ కుర్చీలో కూర్చునేవారని వివరించారు.

  • Loading...

More Telugu News