: కడప జిల్లాను గడగడలాడించిన సైకో కిల్లర్ అరెస్ట్
కడప జిల్లాలో ఓబుళవారి పల్లె మండల పరిధిలోని జీవీపురంలో వరుస హత్యలకు పాల్పడి సంచలనం రేకెత్తించిన సైకో వెంకటరమణను పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య కేసుల్లో సాక్షులుగా ఉన్న ముగ్గురిని సైతం ఇతను హతమార్చడం జిల్లా వాసుల్లో ఆందోళన కలిగించింది. చివరకు సైకో కిల్లర్ తోట వెంకట రమణ పోలీసులకు చిక్కడంతో జీవీపురం వాసులు ఊపిరి పీల్చుకున్నారు.