: విభజన బిల్లును వ్యతిరేకిస్తాం.. అసెంబ్లీని ముట్టడిస్తాం: అశోక్ బాబు
విజయవాడ సివిల్ కోర్టు ప్రాంగణంలో సీమాంధ్ర న్యాయవాదులు సమైక్య శంఖారావాన్ని పూరించారు. ఈ సదస్సులో ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు పాల్గొని ప్రసంగించారు. అసెంబ్లీకి తెలంగాణ బిల్లు రాగానే శాసనసభను ముట్టడించి తీరుతామని, విభజన బిల్లును అడ్డుకోవాల్సిన బాధ్యత అందరిదీ అని ఆయన అన్నారు. విభజన బిల్లును వ్యతిరేకిస్తామని తెలిసే దిగ్విజయ్ హైదరాబాద్ వచ్చారన్నారు. సమైక్య రాష్ట్ర సాధన కోసం అవసరమైతే.. మరోసారి సమ్మెకు సిద్ధమని ఆయన తెలిపారు.