: 'దిగ్విజయ్ గో బ్యాక్'.. శంషాబాద్ విమానాశ్రయంలో సమైక్యవాదుల ఆందోళన
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ హైదరాబాదు రావటంపై సమైక్యవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, శంషాబాద్ విమానాశ్రయంలో దిగ్విజయ్ గో బ్యాక్ అంటూ సమైక్యవాదులు ఆందోళన చేపట్టారు. అప్పటికే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.