: విడిపోతే తెలంగాణకే నష్టం.. విజయవాడే రాజధాని: నేతల మధ్య ఆసక్తికర చర్చ
అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు అసెంబ్లీ లాబీలో తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్ నేతల మధ్య ఆసక్తికర చర్చ నడిచింది. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ ప్రాంతానికే నష్టమని మంత్రి పార్థసారథి తెలుపగా... విడిపోతే విజయవాడ రాజధాని అవుతుంది, అందువల్ల మీక్కూడా విడిపోవాలనే ఉందని గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. సీమాంధ్రులు పైకి సమైక్యమంటున్నా లోపల విడిపోవాలనే కోరుకుంటున్నారని గండ్ర అనగా, తెలంగాణ వారికి కలిసి ఉండడమే కరెక్టు అని ఉన్నా బయటకు మాత్రం విభజన అంటున్నారని మంత్రి అన్నారు.