: హైదరాబాద్ చేరుకున్న దిగ్విజయ్ సింగ్
ఏఐసీసీ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ విమానాశ్రయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్టీ నేతలు కేవీపీ, చిన్నారెడ్డి, దానం, కోమటిరెడ్డి తదితరులు దిగ్విజయ్ కు స్వాగతం పలికారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి నోటీసివ్వడంతో... అసెంబ్లీలో ఎమ్మెల్యేలను ఒప్పించి తెలంగాణ బిల్లును గెలిపించి, వారికి చెక్ పెట్టేందుకు పూర్తి సన్నద్ధంగా దిగ్విజయ్ హైదరాబాద్ కు వచ్చారు.