: నేడు 63వ పడిలోకి అడుగుపెడుతున్న రజనీకాంత్.. బెంగళూరులో వేడుకలు
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ రోజు 63వ పడిలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇవాళ బెంగళూరులో గడపనున్నారు. అక్కడే పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటారని తెలుస్తోంది. ప్రతి ఏడాది తన జన్మదిన వేడుకల కోసం చెన్నై నుంచి అక్కడికి వెళ్లే రజినీ.. ఇప్పటికే బెంగళూరు వెళ్లారని దగ్గరి స్నేహితులు తెలిపారు. కండక్టర్ వృత్తి నుంచి నటుడిగా మారిన శివాజీరావ్ గైక్వాడ్ అనే వ్యక్తి.. నేడు రజనీకాంత్ గా విశ్వవ్యాప్తంగా అభిమానుల చేత కీర్తించబడుతున్నాడు.