: ఓక్లహామా వర్శిటీతో రాష్ట్రం ఒప్పందం
అమెరికాలోని ప్రతిష్ఠాత్మక ఓక్లహామా విశ్వవిద్యాలయంతో రాష్ట్ర ప్రభుత్వం నేడు కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఐటీ రంగంలో ఉపాధి, ఉద్యోగవకాశాల కల్పనపై నేడు రాష్ట్ర ఐటీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య.. ఓక్లహామా వర్శిటీ అధ్యక్షుడితో పరస్పర అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.
తాజా ఒప్పందంతో రాష్ట్ర వాసులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగవకాశాలు లభిస్తాయని భావిస్తున్నారు. కాగా, ఐటీ శాఖ మంత్రి పొన్నాల కూడా ఓక్లహామా వర్శిటీ పూర్వ విద్యార్ధే కావడం విశేషం. ఆయన 1968-69లో ఓక్లహామా వర్శిటీ నుంచి ఏవియేషన్ ఇంజినీరింగ్ లో మాస్టర్ డిగ్రీ అందుకున్నారు.