: అమరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి: ఎర్రబెల్లి
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబంలోని సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో అసెంబ్లీ సమావేశాలకు ముందు గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థుల ఆత్మబలిదానాలతోనే ప్రత్యేక రాష్ట్రం కల సాకారమవుతోందని అభిప్రాయపడ్డారు. అమరవీరుల కుటుంబాలకు టీడీపీ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని ఆయన కోరారు.