: మండేలాకు కేటీఆర్, విజయమ్మల సంతాపం


తరతరాలకు అవసరమైన స్పూర్తిని మండేలా అందించారని టీఆర్ఎస్ నేత కేటీఆర్ అన్నారు. శాసనసభలో ఆయన మండేలా మృతికి సంతాపం ప్రకటించారు. మరణానికి కూడా భయపడకుండా ఆయన పోరాటాన్ని కొనసాగించారని తెలిపారు. నల్లజాతీయులు, ఆఫ్రికన్ల తరఫున ఆయన రాజీలేని పోరాటం చేశారని అన్నారు. కోట్లాది మంది ప్రజలను మండేలా ప్రభావితం చేశారని కేటీఆర్ కొనియాడారు.

మండేలా జీవితం మనకు ఆదర్శమని వైకాపా శాసనసభా పక్ష నేత విజయమ్మ అన్నారు. మానవాళిని మాటలు, చేతలతో నడిపిన వ్యక్తుల్లో మండేలా ఒకరని తెలిపారు. క్షమాగుణంలో మండేలా ఎవరెస్టు శిఖరంలాంటి వారని చెప్పారు.

  • Loading...

More Telugu News