: నేటి నుంచి శాసనసభ శీతాకాల సమావేశాలు


నేటి నుంచి రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు మొత్తం ఏడు రోజులపాటు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రధానంగా తుపాను నష్టం, నిత్యావసర ధరలు, విద్యుత్ ఛార్జీలపై చర్చలు జరగనున్నాయి. తొలి రోజు నల్లసూరీడు నెల్సన్ మండేలాకు సభ నివాళులు అర్పిస్తుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో, ఈ శీతాకాల సమావేశాలు వాడిగా, వేడిగా జరగబోతున్నాయి. అంతే కాకుండా, సీమాంధ్ర, తెలంగాణ ఉద్యమకారులు అసెంబ్లీ పరిధిలో 2 కి.మీ. వరకు ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు చేపట్టకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.

  • Loading...

More Telugu News