: లుకేమియాను నయం చేయవచ్చట


భయంకరమైన బ్లడ్‌ క్యాన్సర్‌ లుకేమియాబారిన పడితే సరైన వైద్యం చేయించుకునే శక్తిలేనివారు ఇక ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందే. ఈ వ్యాధి బారిన పడిన వారు ప్రాణాలు కోల్పోవడం ఎక్కువగా జరుగుతుంది. ఇలాంటి భయంకరమైన వ్యాధికి తాము చక్కటి మందును తయారుచేశామని, తాము తయారుచేసిన మందుతో రోగుల్లో ఈ వ్యాధిని నయం చేశామని వైద్యులు చెబుతున్నారు.

ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్తలు ఒక సరికొత్త మందును తయారుచేశారు. ఈ మందు లుకేమియాను నివారించడంలో చక్కగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాము తయారుచేసిన మందును ప్రాథమికంగా 67 మంది రోగులపై ప్రయోగించి పరిశోధన జరపగా వారిలో 23 శాతం మంది రోగుల్లో లుకేమియా పూర్తిగా నయమయ్యిందని, మరో 61 శాతం మంది రోగుల్లో వ్యాధి నుండి కొంతమేర ఉపశమనం కలిగిందని వైద్యులు చెబుతున్నారు. పది నుండి పదకొండు పర్యాయాలు జరిపే చికిత్సతో పొందే ఫలితాన్ని ఈ ఒక్కమందును వాడి తాము సాధించామని వైద్యులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News