: ట్విన్సే అయినా... జీన్స్‌ వేరట!


ట్విన్స్‌.... ఇంచుమించు ఒకే రూపంతో అచ్చుగుద్దినట్టు ఒకరిని పోలినట్టుగా మరొకరుంటారు. చాలామంది ఇలాగే ఉంటారు. ఏ కొద్దిమందో రూపాలు తేడాగా ఉంటారు. ఇలా ఒకే రూపంతో, ఒకే అండంనుండి, ఒకే డిఎన్‌ఏను పంచుకుని ఒకేసారి జన్మించినా వారి జన్యువులు మాత్రం వేరుగా ఉంటాయట. శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం తేలింది.

జర్మనీలోని జెనోమిక్స్‌ ల్యాబొరేటరీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో కవలల జన్యువుల్లో తేడాలు ఉంటాయని కనుగొన్నారు. చూసేందుకు ఒకే రూపంతో కనిపించే కవలల జన్యువుల్లో తేడాలు ఉంటాయని, కవలలు ఒకే అండం (మోనోజైగోటిక్‌) నుండి, ఒకే రకమైన డిఎన్‌ఏను పంచుకుని పుట్టినా, పిండం ఏర్పడే తొలిదశలో పలు జన్యువుల్లో మార్పులు చోటుచేసుకుంటాయని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గుర్తించారు. మోనోజైగోటిక్‌ కవలలు జన్యుపరంగా ఒకేలా ఉంటారని ఇప్పటి వరకూ భావిస్తూ వచ్చారని, కానీ అది పూర్తిగా నిజం కాదని తమ పరిశోధనలో తేలిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

జన్యుపరమైన తేడాలకు అవకాశం లేదనే భావనతో కవలలకు సంబంధించి నేర, పితృత్వ కేసుల్లో డిఎన్‌ఏ, ఫింగర్‌ ప్రింటింగ్‌ పరీక్షలను చేయడంలేదు. అయితే తాజాగా కవలల జన్యువుల్లో మార్పులను గుర్తించడంలో ఇలాంటి కవలలకు కూడా డిఎన్‌ఏ పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News