: డైనోసార్‌లు ఎందుకు అంతరించాయంటే...


ఒకప్పుడు భూమిపై జీవించిన అతిపెద్ద జీవులుగా పేరొందిన డైనోసార్లు ఎలా అంతరించిపోయాయి? అనే విషయం శాస్త్రవేత్తలకు అంతుచిక్కకుండా ఉండేది. దీనిపై పరిశోధనలు సాగించిన శాస్త్రవేత్తలు డైనోసార్లు అంతరించిపోవడానికి కారణాలను గురించి అన్వేషించసాగారు. ఇందులో భాగంగా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై అతిపెద్ద విస్ఫోటనం సంభవించి ఉంటుందని, దాని కారణంగానే అవి అంతరించి ఉంటాయని చెబుతున్నారు.

బ్రిగామ్‌ యంగ్‌ యూనివర్సిటీకి చెందిన ఎరిక్‌ క్రిస్టియన్‌ సేన్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం అగ్నిపర్వతాల విస్ఫోటన అంశానికి సంబంధించి పరిశోధన చేపట్టారు. ఈ పరిశోధనలో అమెరికాలోని దక్షిణ ఉటా ప్రాంతలో సుమారు మూడు కోట్ల సంవత్సరాల క్రితం అగ్నిపర్వతాలు బద్దలయ్యాయని, ప్రపంచంలోనే అది భారీ విస్ఫోటనమని శాస్త్రవేత్తలు తేల్చారు. 1980లో సంభవించిన సెయింట్‌ హెలెన్‌ అగ్నిపర్వత విస్ఫోటనానికన్నా అప్పుడు జరిగిన విస్ఫోటనం ఐదు రెట్లు పెద్దదిగా జరిగిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అప్పుడు జరిగిన విస్ఫోటన సమయంలో వారం రోజులకు పైగా శిలాద్రవం భారీగా ఉబికి వచ్చి ఉంటుందని, దాని ప్రభావం కొన్ని వందల మైళ్ల వరకూ ఉండి ఉండవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. లావా చల్లారి, ఉటా నుండి నవేడా వరకూ ఫిల్‌మోర్‌ నుంచి సిడార్‌ నగరం వరకూ పలుచోట్ల 13 వేల అడుగుల మందంలో పొరగా ఏర్పడినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇలా అగ్నిపర్వతాలు పేలిన సమయంలోనే రాక్షస బల్లులు అంతరించినట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News