: ఫేస్ బుక్ ద్వారా మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్
సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ట్విట్టర్, ఫేస్ బుక్ ను యువతరం విరివిగా ఉపయోగిస్తోంది. సన్నిహితులను ప్రతిరోజూ పలకరించడం, భావాలను వ్యక్తీకరించడం కోసం పోస్ట్ లు చేయడం ద్వారా ఆన్ లైన్ ఫ్రెండ్స్ తో టచ్ లో ఉంటోంది. అంత వరకూ బాగానే ఉంది... అయితే ఇటీవల కొంత మంది ఫేస్ బుక్ తో ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తున్నారు. తాజాగా ఫేస్ బుక్ తో మరో మహిళకు సమస్యలు ఎదురయ్యాయి. హైదరాబాదు నగరంలో నర్సింగ్ అనే వ్యక్తి మహిళను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇవాళ బాధిత మహిళ ఫిర్యాదు మేరకు బేగంపేట పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.