: అక్కడ 'ఒబామా' ఓడిపోయాడు..!


నిజమే..! ఒబామా ఓడిపోయాడు! అయితే, ఈయన బరాక్ ఒబామా కాదు.. ఆయన సోదరుడు మాలిక్ ఒబామా. ఇంతకీ విషయం ఏంటనుకుంటున్నారా..!? ఇటీవలే కెన్యా ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ అధ్యక్షుడిగా కెన్యాట్టా గెలిచాడు.

అయితే, బరాక్ ఒబామా సోదరుడు మాలిక్ కెన్యా పశ్చిమ ప్రాంతంలో పోటీచేసి చిత్తుగా ఓడిపోయాడు పాపం. 'అమెరికాలో మా సోదరుడు గెలిచాడు.. నేనిక్కడ గెలుస్తాను' అని ప్రచారం చేసుకున్న మాలిక్ ను కెన్యన్లు విశ్వసించలేదని ఆయనకు పోలైన ఓట్లే చెబుతున్నాయి. ఆయనకు కేవలం 2792 ఓట్లు మాత్రమే దక్కాయి. 

  • Loading...

More Telugu News