: ఆయనిప్పుడు అంతర్జాతీయంగా 'క్రేజీ' వాల్!
ఢిల్లీ ఎన్నికల్లో సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ పేరు విదేశాల్లోనూ పాప్యులర్ అయింది. దాంతో, ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన 'ఫారెన్ పాలసీ' అనే ప్రముఖ పత్రిక ఈ సంవత్సరపు ప్రముఖ మేధావుల్లో (గ్లోబల్ థింకర్స్) ఒకరిగా కేజ్రీవాల్ ను పేర్కొంది. దేశ రాజధాని న్యూఢిల్లీలో అవినీతిని నిర్మూలించడానికి ప్రభావవంతమైన కృషి చేస్తున్నారని పత్రిక ప్రశంసించింది. ఇంకా ఈ పత్రిక జాబితాలో పోప్ ప్రాన్సిస్, జర్మన్ ఛాన్సెలర్ ఏంజెలా మార్కెల్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహనీ లాంటి ప్రముఖుల సరసన ఈ పట్టికలో కేజ్రీవాల్ కు చోటు లభించడం విశేషం.