: డేవిడ్ అవుట్..డుమిని డక్ అవుట్
టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో తొలిసారి ఆరంభంలోనే వికెట్లు తీసింది. 21 పరుగులకే ఆమ్లాను పెవిలియన్ బాట పట్టించిన టీమిండియా మరో ఏడు పరుగులు జత చేశాక డేవిడ్(1), డుమిని(0)లను ఇషాంత్ శర్మ వెంటవెంటనే అవుట్ చేశాడు. దీంతో సౌతాఫ్రికా ఏడు ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 28 పరుగులు చేసింది. షమి ఒక వికెట్, ఇషాంత్ శర్మ రెండు వికెట్లు తీశారు.