: ఆమ్లా అవుట్.. సౌతాఫ్రికా స్కోర్ 21/1


సౌతాఫ్రికాలో భారత్, దక్షిణాఫ్రికాల మధ్య చివరిదైన మూడో వన్డే ప్రారంభమైంది. సెంచూరియన్ స్పోర్ట్స్ పార్క్ లో జరుగుతున్న మూడో వన్డేలో సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ పిచ్ అయినప్పటికీ షమీ తొలి వికెట్ తీశాడు. వరుస సెంచరీల వీరుడు డికాక్(9)కు తోడుగా డేవిడ్స్(0) క్రీజులో ఉన్నాడు. హ్యాట్రిక్ మీద కన్నేసిన డికాక్ మరో సెంచరీ సాధించి టీమిండియాపై మూడు వరుస సెంచరీలు సాధించిన ఆటగాడిగా చరిత్రలో నిలిచిపోయేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. సౌతాఫ్రికా ఓపెనర్లు నింపాదిగా బ్యాటింగ్ ప్రారంభించారు. తొలుత కొన్ని మెరుపు బౌండరీలు సాధించిన ఆమ్లా(13)ను షమి బోల్తా కొట్టించాడు. టెస్టు సిరీస్ ముందున్న నేపథ్యంలో సఫారీలు కీలక బౌలర్లైన స్టెయిన్, మోర్కెల్ లకు విశ్రాంతినిచ్చారు.

  • Loading...

More Telugu News