: పంజాబ్, బీహార్ పోలీసుల ఘటనలపై స్పందించిన సుప్రీం
ఈ నెల మొదటివారంలో పంజాబ్, బీహార్ లలో ఇద్ధరు మహిళలపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా, పోలీసు సంస్కరణల్లో భాగంగా ఎలాంటి చర్యలు చేబట్టారో తెలపాలంటూ కేంద్ర , రాష్ట్రాల ప్రభుత్వాలకు సోమవారం సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.
సాధారణ ప్రజలపై దాడికి తెగబడిన పోలీసులపై ఏడు రోజుల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని పంజాబ్, బీహార్ ప్రభుత్వాలకు జస్టిస్ జీఎస్.సింఘ్వీ నేతృత్వంలోని ధర్మాసనం ఆదేశించింది. గతంలో ప్రకాశ్ సింగ్ కేసు విషయంలో పోలీసు సంస్కరణలపై న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల అమలుపై .. కేంద్ర హోమంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, అన్ని రాష్ట్రాల డీజీపీలు, ముఖ్య కార్యదర్శులకు నోటీసులు ఇస్తున్నట్టు కోర్టు తెలిపింది.
ఈ రెండు ఘటనల కేసును మీడియా నివేదికల ఆధారంగా సుమోటోగా తీసుకున్న కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఒక ట్రక్కు డ్రైవరు తనను వేధిస్తున్నాడంటూ మార్చి 4న ఓ మహిళ తన తండ్రిని తీసుకుని ఫిర్యాదు చేయడానికి వెళితే, పంజాబ్ పోలీసులు ఆమెను అవమానించి కొట్టి హింసించారు.
అలాగే, మార్చి 5న పాట్నా అసెంబ్లీ ఎదుట ఆందోళన చేస్తున్న మహిళా కాంట్రాక్టు టీచర్లపై బీహార్ పోలీస్ సిబ్బంది దారుణంగా లాఠీ చార్జ్ చేసి, బాష్ప వాయుగోళాలను ప్రయోగించారు.