: రేపు హైదరాబాద్ రానున్న డిగ్గీ రాజా టీం
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి దిగ్విజయ్ సింగ్ రేపు హైదరాబాద్ కు రానున్నారు. రాష్ట్ర విభజనపై సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టడంతో, కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని చక్కదిద్దేందుకు డిగ్గీ రాజాతో పాటు ఏఐసీసీ కార్యదర్శి తిరునావక్కరసు, ఆర్ సి కుంతియా కూడా రానున్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభ సమయంలో వీరు రాష్ట్రానికి వస్తుండడంతో, వారి పర్యటన పట్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది.