: పార్లమెంటు సాక్షిగా దళిత క్రైస్తవులపై లాఠీచార్జ్
తమను ఎస్సీల్లో చేర్చాలంటూ పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించిన దళిత క్రైస్తవులపై పోలీసులు లాఠీ ఝళిపించారు. దళిత క్రైస్తవులు బీసీ-సీ కేటగిరీలో రిజర్వేషన్లు పొందుతున్నారు. అయితే తమకు మతం ప్రాతిపదికగా కాకుండా.. కులం ప్రాతిపదికగా రిజర్వేషన్లను వర్తింపజేయాలంటూ దళిత క్రైస్తవులు కదంతొక్కారు. పార్లమెంటు ముట్టడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.