: తండ్రి మృతిని జీర్ణించుకోలేకపోతున్న హాలీవుడ్ నటుడి కుమార్తె
ప్రముఖ హాలీవుడ్ హీరో పాల్ వాకర్ మృతిని అతని 15 ఏళ్ల కుమార్తె జీర్ణించుకోలేకపోతోంది. ఈ వారాంతంలో పాల్ వాకర్ అంత్యక్రియలను నిర్వహించేందుకు సహచర నటీనటులు ప్రణాళికలు సిద్ధం చేశారు. నవంబర్ 30న కాలిఫోర్నియాలోని క్లారిటా నగరంలో ఓ ఛారిటీ షోలో పాల్గొని వస్తూ, పాల్ వాకర్ ప్రమాదానికి గురై మృతి చెందిన సంగతి తెలిసిందే. పాల్ వాకర్ కుమార్తె తండ్రి మృతితో షాక్ కు గురైందని, షాక్ నుంచి కోలుకునేందుకు స్నేహితులతో గడుపుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు.