: సోనియాను మనమెలా తొలగించగలం: ఆనం వివేకా
ఒకసారి తప్పు జరిగినంత మాత్రాన కాంగ్రెస్ పార్టీని దోషిగా చూడకూడదని ఆ పార్టీ ఎమ్మెల్యే ఆనం వివేకా అన్నారు. అధిష్ఠానాన్ని ధిక్కరించేలా ప్రవర్తించకూడదని అభిప్రాయపడ్డారు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. సోనియా దిగిపోవాలన్న ఒక నేత వ్యాఖ్యపై స్పందిస్తూ... సోనియాగాంధీ ఏఐసీసీ ఎన్నుకున్న నాయకురాలని... ఆమెను మనమెలా తప్పించగలమని అన్నారు. నాయకులు తమ అభిప్రాయాలను స్వేచ్చగా చెప్పుకునే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీలో ఉందని తెలిపారు. దిగ్విజయ్ సింగ్ ఎవరినీ బుజ్జగించే ప్రయత్నాలు చేయరని అన్నారు. సీఎం కిరణ్ కాంగ్రెస్ పార్టీకి విధేయుడని... ఆయన కొత్త పార్టీ పెడతారని తాను భావించడం లేదని చెప్పారు.