: ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన సంగతిని కేసీఆర్ గుర్తుంచుకోవాలి: మోత్కుపల్లి
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు విరుచుకుపడ్డారు. టీడీపీని కేసీఆర్ విమర్శించే ముందు, ఎన్టీఆర్ కాళ్లు పట్టుకుని పైకి వచ్చిన సంగతిని ఆయన గుర్తుకు తెచ్చుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పునర్నిర్మాణం చేస్తానని కేసీఆర్ అంటున్నాడని... ఆయన చేసేది తెలంగాణ పునర్నిర్మాణమా? లేక పెత్తందార్ల పునర్నిర్మాణమా? అని ప్రశ్నించారు. ఫాం హౌస్ లో పడుకుని లేచే కేసీఆర్ కు చంద్రబాబుని విమర్శించే నైతికత కానీ, స్థాయి కానీ లేవని అన్నారు. అంతేకాకుండా, తాను కూడా ఆంధ్ర ప్రాంతం నుంచే వచ్చిన సంగతిని కేసీఆర్ మరిచిపోకూడదని ఎద్దేవా చేశారు.