: రామాయపట్నం పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్


రాష్ట్రంలో రెండో భారీ నౌకాశ్రయ నిర్మాణానికి కేంద్రం పచ్చ జెండా ఊపింది. ప్రకాశం జిల్లా రామాయపట్నంలో సుమారు 10 వేల ఎకరాల్లో ఈ పోర్టు నిర్మించనున్నారు. ప్రైవేటు భాగస్వామ్యంలో నిర్మించబోయే ఈ ఓడరేవుకు రూ. 7500 కోట్లు ఖర్చవుతుందని అంచనా.

ఈ భారీ నౌకాశ్రయాన్ని తొలుత 2 బెర్తులతో ప్రారంభించి అనంతరం 20 బెర్తుల వరకు విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, పోర్టు నిర్మాణాన్ని మూడేళ్లలో పూర్తిచేసేందుకు కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. రామాయపట్నంలో ఓడరేవుతో పాటు షిప్పింగ్ యూనిట్, ఇతర గోడౌన్లు, కోల్డ్ స్టోరేజిలు, రవాణా యూనిట్ లు నిర్మిస్తారు.

ఈ పోర్టు రాకతో దాదాపు 20 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇక్కడ పోర్టు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలపడంతో రామాయపట్నం పరిసర ప్రాంతాల్లో భూముల ధరలు చుక్కలనంటుతాయని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News