: మళ్లీ పిటిషన్ వేయాలని హరీష్ రావుకు హైకోర్టు సూచన
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సొంత జిల్లాకు నీటి ప్రాజెక్టు కేటాయింపుపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు పరిశీలించింది. పిటిషన్ లో సాంకేతిక లోపాలున్నాయని, మళ్లీ కొత్త పిటిషన్ దాఖలు చేయాలని సూచించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.