: నాటో వైమానిక దాడుల్లో ఆఫ్గాన్ నటుడు మృతి
నాటో యుద్ధవిమానాలు ఆదివారం జరిపిన దాడుల్లో ఆఫ్గనిస్తాన్ వర్ధమాన నటుడు నజార్ అహ్మద్ హెల్మంది మరణించారు. హెల్మందితో పాటు ఈ దాడుల్లో మరో ముగ్గురు మిలిటెంట్లు కూడా హతమయ్యారు. మాదక ద్ర్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాద వ్యతిరేక చైతన్యంపై నిర్మించిన డజను చిత్రాల్లో హెల్మంది నటించారు.
కాగా, హెల్మంది ప్రభుత్వం తరుపున గూఢచర్యం నెరపుతున్నాడన్న కారణంతో మిలిటెంట్లు ఆయన్ను అపహరించారు. ఖోస్కబి పట్టణంలో అనారోగ్యంతో బాధపడుతున్న తన సోదరిని పరామర్శించేందుకు వెళ్లిన హెల్మందిని సాయుధ తిరుగుబాటుదార్లు నిర్భంధించారు.
ఆయనను వారు ప్రశ్నిస్తున్న సమయంలో నాటో వైమానిక దాడులు చోటు చేసుకోవడంతో హెల్మందితో పాటు అక్కడే ఉన్న ముగ్గురు మిలిటెంట్లు ప్రాణాలు విడిచారు. కాగా, మరణించిన మిలిటెంట్లలో తిరుగుబాటు దళాల కమాండర్ మహ్మద్ ఆలమ్ కూడా ఉన్నట్టు ఆఫ్గాన్ పోలీసులు తెలిపారు.