: రేపు 11 గంటల వరకు లోక్ సభ వాయిదా
సీమాంధ్ర నేతల సమైక్యాంధ్ర నినాదాల మధ్య లోక్ సభను రేపు ఉదయం 11 గంటల వరకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ మీరా కుమార్ ప్రకటించారు. అంతకు ముందు వాయిదా అనంతరం, సభ ప్రారంభం కాగానే సీమాంధ్ర ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ సభలో చదివి వినిపించారు. ఎంతగా వారిస్తున్నా ఎంపీలు కుర్చీలో కూర్చోకుండా నినాదాలతో హోరెత్తిస్తుండటంతో... తీవ్ర గందరగోళం మధ్య సభ ఆర్డర్ లో లేదంటూ స్పీకర్ లోక్ సభను వాయిదా వేశారు.