: అవిశ్వాసానికే బీజేపీ మొగ్గు!
వాడి వేడి చర్చల అనంతరం యూపీఏ ప్రభుత్వంపై సీమాంధ్ర ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించినట్టు సమాచారం. దీంతో యూపీఏ మనుగడ మరింత కష్టతరంగా మారింది. అవిశ్వాస తీర్మానంపై మద్దతు ఇవ్వకపోతే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని అనుకునే అవకాశం ఉందని బీజేపీలోని ఒక వర్గం వాదించింది. అవిశ్వాసానికి మద్దతిస్తే తెలంగాణకు తాము వ్యతిరేకమనే మెసేజ్ వెళుతుందని మరి కొంత మంది వాదించారు. ఈ క్రమంలో సీమాంధ్ర ఎంపీల అవిశ్వాసానికి మద్దతు పలకాలని నిర్ణయించడమే కాకుండా.... ఎన్డీయేలోని భాగస్వామ్య పక్షాలను కూడా బీజేపీ కోరనున్నట్టు సమాచారం.