: తెలంగాణను అడ్డుకునేందుకు కిరణ్ కొత్త ఎత్తు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొత్త ఎత్తు వేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఈ రోజు సాయంత్రం విదేశీ పర్యటన నుంచి ఢిల్లీకి చేరుకుంటారు. న్యాయనిపుణుల సలహా తీసుకున్న తర్వాత తెలంగాణ బిల్లును రాష్ట్రానికి రేపో, ఎల్లుండో పంపనున్నారు. అభిప్రాయాల నివేదనకు అసెంబ్లీకి 45 రోజుల సమయం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలను ఐదు రోజులతోనే ముగించేయాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం.
దీనికి నిదర్శనంగా సంక్రాంతి తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. వచ్చే ఎన్నికల వరకూ తెలంగాణ బిల్లు అలానే ఉంటుందన్నారు. అంటే సంక్రాంతి తర్వాత బిల్లును కేంద్రానికి పంపితే.. అప్పుడు కేంద్రం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించి ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇది అయ్యే పని కాదని సీఎం వర్గాల అభిప్రాయం.