: సచిన్ ను క్రీడా శాఖ మంత్రి చేయాలి: మిల్కా సింగ్


భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ ను దేశ క్రీడా శాఖ మంత్రి చేయాలని దిగ్గజ ఫీల్డ్ స్ప్రింటర్ మిల్కా సింగ్ అభిప్రాయపడ్డారు. సచిన్ క్రీడా మంత్రి అయితే దేశంలో ఆటల అభివృద్ధికి తోడ్పడతాడని అన్నారు. ఒక ఆటగాడే ఆ శాఖకు చిత్తశుద్ధితో పని చేసే వీలుంటుందని మిల్కా పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరిలో గోవా రాజధాని పనాజీలో జరగనున్న లూసోఫోనియా గేమ్స్ మస్కట్ ను మిల్కా నిన్న (మంగళవారం) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ముందుగా హాకీ క్రీడాకారుడు ధ్యాన్ చంద్ కే దక్కాలని, ఆ తర్వాతే ఎవరైనా అని అన్నాడు.

  • Loading...

More Telugu News