: అవిశ్వాసానికి మద్దతిస్తాం... అసెంబ్లీలో తీర్మానాన్ని వ్యతిరేకిస్తాం: జగన్


అవిశ్వాసానికి మద్దతిస్తామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. శాసనసభలో కూడా విభజన బిల్లును వ్యతిరేకిస్తామన్నారు. సొంత పార్టీ ఎంపీలే అవిశ్వాస తీర్మానం పెట్టారని, దీన్ని బట్టి సోనియాగాంధీ రాష్ట్రానికి చేసిన అన్యాయం అర్థమవుతోందన్నారు. టీడీపీ ఎంపీల్లో ఇద్దరు ఇంకా తీర్మానంపై సంతకం చేయలేదని, ఆ పార్టీ డబుల్ గేమ్ ఆడుతోందన్నారు. తమ పార్టీకి ముగ్గురు ఎంపీలు మాత్రమే ఉన్నారని.. అయినా అవిశ్వాస తీర్మానానికి మద్దతు పలుకుతామన్నారు.

  • Loading...

More Telugu News