: సీమాంధ్ర ఎంపీల అవిశ్వాస తీర్మానంపై కాసేపట్లో బీజేపీ నిర్ణయం
యూపీఏ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఇతర పార్టీల మద్దతు కూడగట్టడానికి సీమాంధ్ర ఎంపీలు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చే అంశంపై బీజేపీ మల్లగుల్లాలు పడుతోంది. ఈ అంశంపై బీజేపీ సీనియర్ నేతలు సమావేశమై చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. మరి కాసేపట్లో దీనికి సంబంధించి బీజేపీ ఓ తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.