: మిగ్-21 విమానాలు ఇక మూలకే
50 ఏళ్ల పాటు భారతీయ వాయుసేనకు చెప్పుకోదగ్గ సేవలందించిన మిగ్-21 విమానాలు నేటితో చరిత్రలో కలిసిపోనున్నాయి. 1971 పాకిస్థాన్ తో జరిగిన యద్ధంలో శత్రుసేనలను మట్టికరిపించిన మిగ్ లు విశ్రాంతి తీసుకోనున్నాయి. నేడు చివరి సారిగా నాలుగు మిగ్-21 యుద్ధ విమానాలు పశ్చిమబెంగాల్లోని కలైకుంద బేస్ వద్ద గగనంలో విహరించనున్నాయి. దీనికి వాయుసేనాధిపతి బ్రౌనే హాజరవుతారు. మిగ్-21 విమానాలను పక్కన పెట్టడానికి కారణం కూడా లేకపోలేదు. గత కొన్నేళ్లుగా ఈ విమానాలు తరచూ కూలిపోతూనే ఉన్నాయి. ఇలా కూలడం వల్ల 200 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. ఈ నేపథ్యంలో కాలం చెల్లిన ఈ విమానాల గత సేవలను స్మరించుకుంటూ నేటితో వాయుసేన ఘనంగా వీడ్కోలు పలుకుతోంది.