: ప్రభుత్వానికి అవసరమైన బలం ఉంది: కమల్ నాథ్
సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టడంపై పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్ నాథ్ చాలా ధీమాగా ఉన్నారు. తీర్మానం వీగిపోతుందన్నారు. ప్రభుత్వానికి అవసరమైన సంఖ్యా బలం ఉందని, షెడ్యూల్ ప్రకారమే లోక్ సభ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.