: కోల్ ఇండియాకు సీసీఐ భారీ జరిమానా
దేశీయ బొగ్గు ఉత్పత్తి దిగ్గజం కోల్ ఇండియాకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) భారీ జరిమానా విధించింది. బొగ్గు సరఫరాలో తన ఆధిక్యతను దుర్వినియోగం చేసిన నేపథ్యంలో సీసీఐ రూ.1,773 కోట్ల జరిమానా విధించింది. ఒక ప్రభుత్వ రంగ సంస్థపై ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించటం ఇదే తొలిసారి. దేశీయంగా నాన్ కోకింగ్ కోల్ ఉత్పత్తి, సరఫరాలో ఎలాంటి ఆటంకాలు లేకుండా అగ్రస్థానంలో కొనసాగుతూ వస్తున్న కోల్ ఇండియా.. మార్కెట్ ను స్వతంత్రంగా నియంత్రిస్తున్నట్లు గుర్తించటంతో సీసీఐ ఈ జరిమానా విధించింది.