: అవిశ్వాసం పెట్టిన సీమాంధ్ర ఎంపీలపై వేటు ఖాయం: కాంగ్రెస్ అధికార ప్రతినిధి పీసీ చాకో


సొంత పార్టీపైనే అవిశ్వాస తీర్మానం పెట్టిన సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలపై వేటు వేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందున సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి, ఉండవల్లి, సబ్బం హరి, హర్షకుమార్, రాయపాటి, సాయిప్రతాప్ లపై వేటు వేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పీసీ చాకో తెలిపారు. ప్రస్తుతం ఏ పార్టీ కూడా ఎన్నికలను కోరుకోవడం లేదని... అవిశ్వాస తీర్మానాలు వీగిపోతాయని ఆయన తెలిపారు. అవిశ్వాస తీర్మానానికి ఎవరి మద్దతు లభించదని అన్నారు.

  • Loading...

More Telugu News