: ఢిల్లీలో రాష్ట్రపతి పాలన తప్పదా?


దేశ రాజధానిలో మళ్లీ ఎన్నికలపై భారీ చర్చ జరుగుతోంది. ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ కానీ, రెండో స్థానంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో అక్కడ ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధత ఇంకా వీడలేదు. కాగా హోం శాఖ సమీక్షా సమావేశంలో ఢిల్లీ వ్యవహారాలను లెఫ్టినెంట్ గవర్నర్ చూస్తున్నారని, రాష్ట్రపతి పాలనపై లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి తమకు ఎలాంటి సమాచారం అందలేదని షిండే స్పష్టం చేశారు. దీనికితోడు బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, విజేతలైన బీజేపీ ఎమ్మెల్యేలందరూ... ఎమ్మెల్యేలుగా కాక కేవలం అభ్యర్థుల మాదిరిగానే నడుచుకోవాలని సూచించారు. అంటే మళ్లీ ఎన్నికలకు సిద్ధమవ్వాలని ఆయన తమ అభ్యర్థులకు పరోక్షంగా సూచించారు.

మరో వైపు కేజ్రీవాల్ బీజేపీకి మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి తాము మద్దతు తీసుకునే పరిస్థితి లేదని కూడా తెలిపారు. ఢిల్లీ ప్రజలు తమకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆధిక్యం ఇవ్వనందున తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని రెండు పార్టీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఏ పార్టీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు రాకపోతే, లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతి పాలన విధించి ఆరు నెలల్లోపు ఎన్నికలకు వెళ్లాల్సిందిగా ఆదేశించే అవకాశం ఉంది. దీంతో ఢిల్లీలో ఏం జరగబోతోందా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Loading...

More Telugu News