: శాసనసభ, శాసనమండలి అజెండాలో తెలంగాణపై చర్చ ఉంటుందా?
ఈ రోజు సాయంత్రం శాసనసభ, శాసనమండలి వ్యవహారాల సంఘాలు (బీఏసీ) సమావేశం కానున్నాయి. రేపట్నుంచి ప్రారంభం కానున్న సమావేశాలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి... ఏయే అంశాలను అజెండాలో చేర్చాలనే విషయంపై తుది నిర్ణయానికి రానున్నాయి. రాష్ట్ర విభజన బిల్లు ఈ రోజు సాయంత్రం వరకు రాష్ట్రానికి వచ్చే అవకాశం లేకపోవడంతో, బీఏసీల అజెండాలో తెలంగాణపై చర్చ ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా వారం రోజుల పాటు జరిగే శీతాకాల సమావేశాలను, ఈసారి కూడా అన్ని రోజులపాటే కొనసాగించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే, తెలంగాణ బిల్లు వచ్చిన తర్వాత మరోసారి ప్రత్యేకంగా సమావేశమవుదామని అధికార పార్టీ సభ్యులు ప్రతిపాదించే అవకాశాలు కనపడుతున్నాయి.